Listen to this article

జనం న్యూస్ 31 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా మార్కెట్ లో డంపింగ్ చేసిన వేరుశెనగ పంటను పరిశీలించిన జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు.బాసు హనుమంతు నాయుడు ఈరోజు గద్వాల నియోజకవర్గం పరిధిలోని గద్వాల మార్కెట్ యార్డ్ నందు *స్థానిక పార్టీ నాయకులు,రైతులతో కలిసి వేరుశెనగ డంపింగ్ ను పరిశీలించారు.. అనంతరం,మార్కెట్ యార్డ్ లో అధికారునీ కలిసి వేరుశెనగ పంటకు మరియు ఇతర పంటలకు మద్దతు ధర కల్పించాలని వారు కోరారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు…. రైతులు పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధర ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని అన్నారు… ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చేవరకు వరకు బిఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాడుతుందని అన్నారు.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆయన అన్నారు… రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని చెప్పి, మండలంలో ఒక గ్రామానికి వేయడం ఏమిటని ప్రశ్నించారు…? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని అన్నారు…ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు కురువ విజయ్ కుమార్,పార్టీ సీనియర్ నాయకులు మోనెష్,మల్దకల్మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డి.శేఖర్ నాయుడు,శ్రీ రాములు,గంజిపేట రాజు,శ్రీనివాసులు,బీచుపల్లి,తిమ్మప్ప గౌడ్,ఎండి.మాజ్,ముని మౌర్య,ఆటో ముక్బాల్,పరశురాముడు,వీరేష్ గౌడ్,గంగాధర్,బషీర్,కురువ బజారి, సుధాకర్,కామేష్,మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలు, యూత్ సభ్యులు,రైతులు తదితరులు పాల్గొన్నారు..