ఎస్ ఐ, శ్రీ చైతన్య కుమార్ రెడ్డి
మన ప్రజా ప్రతినిధి తెలుగు దిన పత్రిక మెదక్ జిల్లా చేగుంట అక్టోబర్ 31,
భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా
రాష్ట్రీయ ఏక్తా దివస్ లో భాగంగా చేగుంట పట్టణ కేంద్రం లొ ఎస్ ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు.2K రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఎస్ ఐ ఘనంగా ప్రారంభించి,ముందుగా గాంధీ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ.. భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఏకం చేసిన మహోన్నత నాయకుడు ఆయన అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లొ ఏఎస్ఐ శ్రీనివాస్, పిఏసిఎస్ చైర్మన్ అయిత రఘరాములు, సంఘాసేవకులు అయిత పరంజ్యోతి, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్ల లక్ష్మణ్, ఎస్ టి యు, మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు, పెంటా గౌడ్, మనోహరరావు, వారాల నరసింహులు, లైన్స్ క్లబ్ సభ్యులు రామచంద్రం, లింగమూర్తి, సంజీవ్, ప్రశాంత్, సంతోష్, చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ రాజు, రమేష్, వెంకటేష్, విటల్, మహేష్, బ్రహ్మం, లక్ష్మణ్, సత్యం, విద్యార్థిని,విద్యార్థులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు



