Listen to this article

పాపన్నపేట, అక్టోబర్ 31( జనం న్యూస్ )

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు, ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు, ముందుగా ఎస్సై శ్రీనివాస్ గౌడ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, పోటీలలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు బహుమతులను ఎస్సై చేతులమీదుగా ప్రధానం చేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయులు అంజాగౌడ్, ప్రవీణ్, నింగప్ప, కృష్ణ కాంత్, రియాజ్, మోహన్ రావు నాగరాజు, అనిల్ ,విశ్వనాధ్ సుభాష్ తో పాటు పోలీసు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.