

జనం న్యూస్ జనవరి 31 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన మండలం దొంతికుర్రు పంచాయతీ పరిధిలో పెదచెరువు పేటలో దాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి భూమిపూజ జరిగింది. ఈ భూమి పూజకు ముఖ్య అతిథులుగా జొన్నాడ రాజారావు ,గెల్లా రాజేంద్ర ప్రసాద్,రేవు సత్యవతి ,గెద్దడి వెంకటేశ్వరరావు లు పాల్గోన్నారు. . ఈ సందర్బంగా రాజరావు మాట్లడుతూ గ్రామస్థుల సహకారంతో నిర్మించ తలపెట్టిన ఈ భవనం గ్రామంలోని అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మన ఐక్యతే మన బలమని అన్నారు. తొలుత ముహూర్తం సమయానికి కొబ్బరికాయను కొట్టి, ఈ భవనం అతి తొందరగా నిర్మాణం కావాలని ప్రార్దించారు. మరొక ముఖ్య అతిధి గెల్లా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతీరోజూ గ్రామంలోని అందరూ కలిసి ఒకచోట కూర్చుని తమ సమస్యలను చర్చించు కోవడానికి ఒక సమాజిక భవనం అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతీ గ్రామంలో మన సామాజిక వర్గానికి సామాజిక భవనం అవసరమని నలుగురూ కూర్చుని మాట్లాడుకొంటే అందరిలో ఐక్యతా భావం పెరుగుతుందని మన ఐక్యతే మన బలం అని అన్నారు. భూమి పూజ అనంతరం దొంతికుర్రు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గ్రామస్థులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..