జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కింద స్థాయి ఉద్యోగిగా ప్రారంభించి, రాజకీయాలకు అతీతంగా 38 ఏళ్ల పాటు ప్రజా పరిపాలనలో నిబద్ధతతో సేవలు అందించిన ఎంపీడీవో ఆజారి భానుమూర్తి సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు.శుక్రవారం ఆయన పదవీ విరమణ సందర్భంగా మెంటాడ మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నేతలు ఆయనకు శాలువాలు కప్పి, పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంలో మాట్లాడిన నేతలు— భానుమూర్తి తన పదవీ జీవితమంతా క్రమశిక్షణతో, పారదర్శకంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు. కింద స్థాయి నుండి ప్రారంభించి, నిస్వార్థ సేవా ధోరణితో ఎదిగిన ఆయన యువతకు ఆదర్శం అని పేర్కొన్నారు.టిడిపి, వైసీపీ ఇరుపార్టీల నేతలు ఒకే వేదికపై భానుమూర్తిని అభినందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, జడ్పిటిసి అధికార ప్రతినిధి లెంక రత్నాకర్ నాయుడు, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు చలుమూరు వెంకట్రావు, టిడిపి పార్టీ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు గెద్ద అన్నవరం, వైస్ ఎంపీపీ మరియు బంగారు నాయుడు, పార్టీ నేతలు కపారపు పైడపునాయుడు, పెదమేడపల్లి ఎంపీటీసీ రెడ్డి ఎర్రినాయుడు, మెంటాడ గ్రామ సర్పంచ్ రేగిడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం ముగింపు సందర్భంగా అధికారులు, సిబ్బంది, ప్రజలు భానుమూర్తిని ఘనంగా అభినందించి ఆయనకు భవిష్యత్తు జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.


