జనంన్యూస్. 01.సిరికొండ.
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు దళితుల ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు బయల్దేరిన సిరికొండ మండలం MRPS, MSP మరియు అనుబంధ సంఘాల నాయకులు..భారత దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయి మీద దాడిని ఖండిస్తూ ఈ రోజు మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు ఛలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు సిరికొండ మండలం నుండి MRPS నాయకత్వం హైదరాబాద్ బయల్దేరడం జరిగింది.ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా MRPS సిరికొండ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ మాదిగ మాట్లాడుతూ జస్టిస్ BR గవాయి మీద జరిగిన దాడిని తీవ్రంగా దళిత సమాజం ఖండిస్తుందని, అందుకే ఈ ఆత్మగౌరవ ప్రదర్శన ద్వారా దళితుల సత్తా చాటుతామని తెలియచేయడం జరిగింది. అలాగే ఈ దేశంలో ఎక్కడ దళితుల మీద దాడులు జరిగిన మొదట స్పందించి, ఒక కార్యాచరణను రూపొందించే నాయకుడు ఒక పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మాత్రమే అని తెలియచేయడం జరిగింది.సిరికొండ మండలం నుండి హైదరాబాద్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు తాటిపల్లి గ్రామ అధ్యక్షుడు దాసరపు చలపతి ఇంద్ర కుమార్ దేవరాజ్ భరత్ సుదర్శన్ దేవయ్య భూమయ్య ఎల్లయ్య గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



