జనం న్యూస్ నవంబర్ 1 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) న్యూస్ :
ఎల్కతుర్తి గ్రామంలోఇటీవలే మరణించిన బోనగిరి ఐలయ్య కుటుంబాన్ని తంగళ్లపల్లి యువసేన వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్లపల్లి రమేష్ పరామర్శించారు. ఐలయ్య మరణం పట్ల ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. కుటుంబానికి ఆర్థిక భారం కొంత తగ్గించాలన్న ఉద్దేశ్యంతో 50 కిలోల బియ్యం అందజేశారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా కష్టకాలంలో ప్రజలతో నిలబడి సాయం చేయడం మనందరి కర్తవ్యము అని ఐలయ్య కుటుంబానికి భవిష్యత్తులో కూడా సహాయం అందించడానికి ప్రయత్నిస్తాను అన్నారు ఈ కార్యక్రమంలో తంగెళ్ళపల్లి రాజ్ కుమార్ ఎల్కతుర్తి రజక సంఘం అధ్యక్షుడు. బండి కుమారస్వామి తంగెళ్ళపల్లి కొమరయ్య బోనగిరి కుమారస్వామి పడాల మల్లయ్య గోడిశీల అర్జున్ తదితరులు పాల్గొన్నారు


