Listen to this article

జనం న్యూస్, నవంబర్ 01,అచ్యుతాపురం:

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం భాగవతుల చారిటబుల్ ట్రస్టులో నూతనంగా వెటర్నరీ జినామిక్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూగజీవాల ఆరోగ్య పరీక్షల గదిని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.బిసిటీలో అధునాతన శాస్త్ర సాంకేతికతో ఏర్పాటు చేసిన పరీక్షల గదిని ప్రారంభించిన అనంతరం అక్కడ నెలకొల్పిన టెక్నాలజీ,అవి పనిచేసే తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మనుషులతో పాటుగా ముగా జీవాలు కూడా చాలా ముఖ్యమని, వాటి బాగోగులకై బిసిటి వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ మోహన షీలా, బిసిటి వైద్య బృందం,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు