Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

ఆంధ్ర రాష్ట్రంలో పెన్షనర్ల కుటుంబాలలో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్ అన్నారుశనివారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను నందలూరు గ్రామంలోని దుర్గాపురం లో సచివాలయం సిబ్బందితో కలిసి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు సూచన మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షనర్లకుటుంబంలో ఆనందాన్ని చూడాలని దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 4000 నుండి 15000 వరకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు రాష్ట్రంలో ఒకటో తారీకు అనగానే ఒక పండగ వాతావరణం గ్రామాలలో ఉన్నాయన్నారు ఉదయం 7 గంటల నుండి సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు , దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వివిధ పెన్షనర్లకు అద్భుతంగా సచివాలయం సిబ్బంది పెన్షన్లు ఇస్తున్నారు అన్నారు. వైకాపా నాయకులు మాత్రం విషం చిమ్ముతూ పెన్షన్లను తొలగిస్తున్నారని పెన్షన్ దారులలో ఆందోళన కలిగిస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో అనేక అక్రమ పెన్షన్లను నమోదు చేశారు వాటిని తొలగించే కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హులైన ప్రతి ఒక్క అర్హులకి పెన్షన్ ఇవ్వాలని లక్ష్యంతో ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి సుబ్రహ్మణ్యం, ఆవుల రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు