Listen to this article

జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం జిల్లా బ్యూరో నవంబరు 2 :

మండల పరిధి చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కామా శరత్ బాబు నాగమణి దంపతులకు జన్మించిన ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు నరేష్ (20) చిన్న కుమారుడు అయినటువంటి ప్రవీణ్ (18) మధిరలో గల నాగేంద్ర ఐటిఐ కాలేజీలో రెండవ సంవత్సరం విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు ఇంతలోనే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో గల ఓ ప్రైవేటు హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు విషయం తెలుసుకున్న గ్రామ సి ఈ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ విశ్రాంతి ఉద్యోగి గుజ్జు చిన్నపుల్లాదాసు , రిటైర్డ్ ఎస్సై విశ్రాంతి ఉద్యోగి గుజ్జు పెద్ద పుల్లాదాసు ప్రవీణ్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రవీణ్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని కల్పించారు నివాళులర్పించిన వారిలో చింతమాల ప్రసాదు చింతమాల పుల్లయ్య గ్రామ యూత్ పిల్లలు ఉన్నారు అనంతరం చిన్న పుల్లాదాసు మాట్లాడుతూ ప్రవీణ్ మృతి కుటుంబానికే కాకుండా గ్రామానికి కూడా తీరని లోటు అని ఇటువంటి లోటు ఎవరూ తీర్చలేనిది అని ఆయన తన ఆవేదాన్ని వ్యక్తం చేశారు ప్రవీణ్ మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయిఈ కార్యక్రమంలో చిన్న పుల్లా దాసు బ్రదర్స్ చింతమాల ప్రసాదు చింతమాల పుల్లయ్య యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు