జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
69వ జాతీయస్థాయి అండర్-17 పోటీలకు విజయనగరం క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈనెల 1న ఏలూరులో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్-17లో వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 25న అరుణాచల్ ప్రదేశ్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర అబ్దర్వర్ బుజ్జీ తెలిపారు.


