బిచ్కుంద నవంబర్ 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ యువకులు సోమవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద వారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. యువకులు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా సెంట్రల్ లైటింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాలు మారినా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం యువకులంతా కలిసి అంబేద్కర్ చౌరస్తా ర్యాలీకి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు




