Listen to this article

జనం న్యూస్ నవంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేని కొన.. :

మండలం కుండలేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత శ్రీ కుండలేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా నిమ్మకాయల జగ్గయ్య నాయుడు భారీ అన్న సమారాధన కార్యక్రమం భక్తులకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. అన్ని దానాల కన్నా అన్నదానం శ్రేష్టమైనదని వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు.