జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్టానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.


