కొత్తగూడెం, నవంబర్ 4 (జనం న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆప్కారీ సీఐ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.వివరాల ప్రకారం, కంచు పోగు అఖిల అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ శనివారం రాత్రి తన స్వగ్రామం మోతుగూడెం వెళ్తూ బస్సులో పెద్ద మొత్తంలో సిట్రీజన్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. అఖిలను ప్రయాణికులు అపస్మారక స్థితిలో గమనించి సమీప ఆసుపత్రికి తరలించారు. అఖిల మాట్లాడుతూ, గత ఒక నెల రోజులుగా కొత్తగూడెం ఆప్కారీ సీఐ జయశ్రీ తనను నిరంతరం వేధిస్తున్నారని, ఎవరితో మాట్లాడకూడదని బెదిరిస్తూ, తన కుల వివరాలు తెలుసుకుని దుర్భాషలాడుతూ అవమానపరచారని ఆరోపించింది. “నువ్వు వచ్చిన స్థాయిని బట్టి మెదులుకోవాలి” అంటూ పదే పదే అవహేళన చేసి, చిన్న చిన్న విషయాలకు కూడా సూటి ఫోటోలు, పనుల పేరుతో అనవసరంగా ఇబ్బందులు పెట్టిందని అఖిల తెలిపింది.ఈ మానసిక వేధింపుల వల్లనే తాను ప్రాణాలను తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె ఆరోపించింది.ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖలో కలకలం రేగింది. సహోద్యోగులు అఖిలకు న్యాయం చేయాలని, వేధింపులపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి:మహిళా సిబ్బంది భద్రతపై మళ్ళీ చర్చ మొదలైన పరిస్థితుల్లో ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. అఖిల ఆరోపణలపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు



