జూలూరుపాడు, జనం న్యూస్: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గ్యాస్ త్వరగా అందించాలని అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మండల కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీలను నియమించింది దీనితో సమయానికి గ్యాస్ లభించడం జరుగుతుంది, జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ అందుకు భిన్నంగా పరిస్థితి నెలకొన్నది గత కొన్ని రోజుల నుంచి ప్రజలకు అందుబాటు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలే ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,గ్యాస్ ఆఫీస్ కు,గూడెం కు తాళాలు వేసి ఉంచడంతో సకాలంలో గ్యాస్ లభించక పోవడంతో అధిక5 ధరలకు గ్యాస్ కొనుక్కునే పరిస్థితి నెలకొన్నది. మండల కేంద్రంలో హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ బినామీ పేర్లతో నడిపిస్తున్నారు ఇదే క్రమంలో ఇరువురికి సఖ్యత లేకపోవడంతో గ్యాస్ ఏజెన్సీ ను గత కొన్ని రోజుల నుంచి తాళ్ళలు వేసి ఉండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్యాస్ సరఫరా నిలిచిపోయిన ఇప్పటి వరకు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం పై ప్రజలు అనే ఆరోపణలు చేస్తున్నారు.తక్షణమే మండలంలో హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ సేవలు అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అంతే కాకుండా ఇలాంటి బినామీల కు ఇవ్వకుండా స్థానికంగా ఉండే నిరోధ్యగ యువతి యువకులకు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకొంటున్నారు.


