తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04
జహీరాబాద్. టిఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుకు దారి కాబోతున్నారని గతంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారని ఇప్పుడు అవే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మ విజయానికి సూచిక కాబోతున్నాయని రాంజోల్ వార్డు బీఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ జమిర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళా ఖాతాలో 2500 రుపాయలు, వృద్ధులకు 2 వెయ్యిల నుంచి 4 వెయ్యిలకు, వికలాంగులకు రెట్టింపు చేస్తామని విస్మరించారని అన్నారు.


