మెదక్,నవంబర్04: (జనంన్యూస్)
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల తహసీల్దార్ మాలతి ని మంగళవారం రోజు చిన్నశంకరంపేట మండల పద్మశాలి సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా ఆమె కార్యాలయంలో కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో చిన్నశంకరం పేట మండల అధ్యక్షులు తలకొక్కుల శ్రీనివాస్,పట్టణ అధ్యక్షుడు ఎర్రగంటి కిష్టయ్య,వనం నర్సింలు, మచ్చ సిద్ధిరాములు,ఉడత శ్రీమన్నారాయణ,ముదిగొండ శివకుమార్,బైండ్ల బాలరాజు, చిప్ప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


