Listen to this article

జనం న్యూస్ 05నవంబర్ పెగడపల్లి

మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకుల డిమాండ్ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు పెగడపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు లోక.మల్లారెడ్డిఆధ్వర్యంలో ఈరోజు రైతులు పడుతున్న కష్టాలను చూడలేక కల్లాల బాట పట్టిన పెగడపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.ఈరోజు పెగడపల్లి మండలంలోని ఐకెపి సెంటర్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరి గోసపడుతున్న స్థానిక మంత్రిగా ఉన్న అడ్లూరి.లక్ష్మణ్ కుమార్ కి జూబ్లీహిల్స్ ఎలక్షన్ల మీదున్న శ్రద్ధ నియోజకవర్గ రైతుల పట్ల లేకపోవడం బాధాకరం అని మాట్లాడుతూ,సరిపడా యూరియా మీరు అందించకుండా అరకొర పండిన పంటలను అమ్ముదామని ఐకెపి సెంటర్లలో పోస్తే ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభించని ప్రభుత్వం,మొలకెత్తిన ధాన్యాన్ని చూసి రైతులను ఓదార్చిన మండల నాయకులు,ఐకెపి సెంటర్ లోకి అధికారులను రప్పించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా పై అధికారులకు తెలియజేయాలని సూచిస్తూ రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడే సమయం ఇదే అని మండల అధికారులు జిల్లా అధికారులకు నివేదిక ఇచ్చి రైతుల పక్షాన నిలబడి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఎలక్షన్ల మీద, కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు అని మాట్లాడడం జరిగింది, తడిసిన ధాన్యాన్ని రెండు రోజులలో కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన రైతులతో కలిసి మండల బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఉంటుందని తెలియజేయడం జరిగింది. అకాల వర్షానికి నేలకొరిగిన వరి పంటను పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారంగా ఎకరానికి 20వేల రూపాయలు ఇవ్వాలని మండల బి.ఆర్.ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.