Listen to this article

జనం న్యూస్ – నవంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్ల సమస్యల పరిష్కార సాధనకై ఈనెల7వ తేదీన తలపెట్టిన పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం నాడు పెన్షనర్ల సంఘం బాధ్యులు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నా చౌక్ లో సమస్యల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పి. నారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, కేశవరెడ్డి, ఇంద్రారెడ్డి, ఎం. సీత కళ్యాణి, ఈశ్వరయ్య, సాంబశివరావు, కే. బాలాజీ, సి హెచ్. రవి, నర్సిరెడ్డి తదితరులు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.