జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లా పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎన్డీఏ కూటమి నాయకులు సోమవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం సమీపంలో ధర్నా నిర్వహించారు. “మెంటాడ మా హక్కు, విజయం మా బలం”, “విజయనగరం జిల్లాలోనే మెంటాడ ఉండాలి” అంటూ నినాదాలతో ఆవరణ మొత్తాన్ని మార్మోగించారు.తరువాత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఆర్‌డిఓకి వినతి పత్రం సమర్పించారు. మండలాన్ని ఇతర జిల్లాకు విలీనం చేయాలనే ప్రతిపాదనలను తక్షణం ఉపసంహరించుకోవాలని, ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఏ నిర్ణయం తీసుకున్నా భారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మెంటాడ మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు, పి.ఏ.సి.యస్ మెంటాడ చైర్మన్ గొర్లె ముసలినాయుడు, గెద్ద అన్న వరం రాయి పిల్లి రవిశంకర్, కొల్లా భరత్, ఎంపిటిసి రెడ్డి ఎర్రి నాయుడు, జనసేన పార్టీ నాయకులు రాజశేఖర్, సురేష్, చింత కాశీనాయుడు, పొన్నూరు రామలింగేశ్వరరావు, చొక్కాకు సన్యాసినాయుడు, రెడ్డి రాజగోపాల్, మణిపూరి అప్పలనాయుడు, నారాయణరావు, పల్లె సింహద్రి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ “మెంటాడ మండలం చారిత్రాత్మకంగా, సామాజికంగా, ఆర్థికంగా విజయనగరం జిల్లాతో అనుబంధంగా ఉంది. ప్రజల ఆకాంక్షలను పరిగణించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదు” అని వ్యాఖ్యానించారు.ప్రజల భావోద్వేగాలను గౌరవించి, మండలాన్ని విజయనగరం జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ వినతి పత్రాన్ని అధికారులు స్వీకరించారు.


