గుడిపల్లి మండలం లోని కోదండాపురం లో పురాతన శివాలయము తెల్లవారు జామున నుండి మహిళలు అనేకమంది వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. గ్రామములో ప్రజలు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు పురాతన శివాలయము దర్శించి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీనివాస చార్యులు, ఆలయ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి పాలకమండలి సభ్యులు పాల్గొని కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న స్వాములు ప్రదక్షిణ చేసి శివనామస్మరణ చేశారు.



