Listen to this article

జనం న్యూస్ 4 నవంబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి )

తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల కోసం సాయంత్రం ఐదు గంటలకు బస్సు నడపాలని లేనిచో బస్సులను నిలిపివేసి డిపోని ముట్టడి చేస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు హెచ్చరించారు. బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వర్ని శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు బోధన్ బస్సును నిలిపివేసి రోడ్డుపై బైఠాయించడం జరిగిందని ఏబీవీపీ అధ్యక్షులు ప్రవీణ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ డిపోకు చెందిన బస్సు రుద్రూర్, అంభం,తగిలేపల్లి, వర్ని మీదుగా వచ్చే బస్సు సాయంత్రం ఏడు గంటలకి రావడంతో చదువుకునే విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్నిసార్లు డిపో డిఎం కు ఏబీవీపీ నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని డిపో కార్యాలానికి వెళ్లిన ఏబీవీపీ నాయకులు, తల్లిదండ్రులతో డిఎం నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారని వారు మండిపడ్డారు. ఇకనుంచి అయినా బస్సు ని ఐదు గంటలకి నడపాలని లేనిచో బస్సులను నిలిపివేసి డిపో కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.