మండల అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్
జనం న్యూస్ 06నవంబర్ పెగడపల్లి
ఐదవ రోజుతో ముగిసిన బీసీనాయకుల రిలే నిరాహార దీక్షజగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష మంగళవారంతో ఐదు రోజులరిలేనిరాహారదీక్షవిజయవంతంగా ముగిసింది.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ముగించారు. అనంతరం బీసీ నాయకులు అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్ మాట్లాడుతూ పెగడపల్లి మండలంలోని రిలే నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా సహకరించిన బీసీ కుల బాంధవులకు నాయకులకు కుల సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ బిసి రిజర్వేషన్ 60% ఉన్నప్పటికీ 42% ఇస్తామని ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని అయితే మా రిజర్వేషన్ మాకు అచ్చేంత వరకు మా పోరాటం ఆగదని ఈరోజు చేపట్టిన కార్యక్రమం కేవలం ఆరంభం మాత్రమే అని ముందు ముందు జరగబోయే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని ఎవరైతే బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారో వారిని రాబోయే రోజుల్లో బొంద పెడతామని మా రిజర్వేషన్ల పైన ఎవడో పెత్తనం చేస్తే ఊరుకునేది లేదని డిమాండ్ చేస్తూ ఇకనుండి అయినా బీసీలమంతా ఒకటై కొట్లాడి విద్య వైద్యం ఉద్యోగం స్థానిక స్థలాల్లో మన వాటా మనకొచ్చేంత వరకు పోరాటం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిసి నాయకులు గర్వంద శేఖర్ గౌడ్, ఉప్పు రవి బండారి బీరయ్య ముల్క రాజేశం చిందం తిరుపతి పుల్కం జలపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగల శ్రీనివాస్ బుర్ర రాములు గౌడ్ సురకంటి సత్తిరెడ్డి ఆకుల విష్ణు కడారి తిరుపతి ఎలగొండ కృష్ణ హరి పూసాల తిరుపతి తడగొండ రాజు చెట్ల కిషన్ చాట్ల విజయభాస్కర్ బొడ్డు రమేష్ కుంచె రాజేందర్ బిజెపి నాయకులు కొత్తూరి బాబు పెద్ది బీరయ్య గురిజల రాజిరెడ్డి టిఆర్ఎస్ నాయకులు కాసెట్టి వీరేశం బిసి కుల సంఘాల నాయకులు తోట మల్లయ్య బైర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


