జనం న్యూస్, నవంబర్ 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
జగదేవపూర్ కార్తీక పౌర్ణమి సందర్భంగా మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ” రాముని బండ ” జాతర సందర్భంగా దేవాలయ కమిటి ఆధ్వర్యంలో ఆచార్యులు జగన్నీవాస చారి ఆధ్వర్యంలో ఆలయం వద్ద రాజగోపురం నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవాన్ని
బుధవారం ఘనంగా నిర్వహించారు.ఉదయం 4 – 15 నిమిషాల నుండి 5–40 వరకు రాజగోపుర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం అనంతరము స్వామి వారికి అభిషేకాలు, అష్టోత్తర నామాలు కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాజ గోపురం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో
ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమార్ ,పెద్దలు ఆలయ కర్తలు రవీందర్ రెడ్డి, ప్రొద్దుటూరు శ్రీనివాస్, చారీ, పిఎసిఎస్ చైర్మెన్ ఆలెటి ఇంద్రసేన రెడ్డి,తీగుల్ మాజీ సర్పంచ్, యువజన కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కప్పర భాను ప్రకాశ్ రావు,హన్మంత రెడ్డి, ముదిరాజు సంఘం అధ్యక్షులు
కొండయ్య, ప్రశాంత్, లక్ష్మన్ రాజు,ఆలయ నిర్మాణ దాతలు గ్రామస్తులు, యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


