జనం న్యూస్ నవంబర్ 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
దక్షిణ రైల్వే ప్రకటించిన పండుగ ప్రత్యేక రైళ్లకు అదనపు హాల్ట్లు ఇవ్వాలనే అంశంపై రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సి.ఎం. రమేష్ రైల్వే ఉన్నతాధికారులకు చేసిన వినతి మేరకు అనకాపల్లి రైల్వే స్టేషన్లో భువనేశ్వర్ – బెంగళూరు ఎక్స్ప్రెస్కు హాల్ట్ మంజూరైనట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.భువనేశ్వర్ – బెంగళూరు, భువనేశ్వర్ – యశవంత్పూర్ మరియు భువనేశ్వర్ – చెన్నై ప్రత్యేక రైళ్లు ఇప్పుడు అనకాపల్లి, నర్సాపురం, మార్కాపురం రోడ్ స్టేషన్లలో ఆగనున్నాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.గతంలో అనకాపల్లి ఎంపీ కి చేసిన వినతులను పరిగణనలోకి తీసుకుని,జిల్లా ప్రజల అవసరాలను గుర్తించి రైల్వే శాఖతో నిరంతరంగా చర్చలు జరిపి హాల్ట్ కోసం కృషి చేసిన ఎంపీ సి.ఎం. రమేష్ కి కూటమి నాయకులు, స్థానిక ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.//


