జనం న్యూస్ 07 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా
తెలంగాణ ప్రగతిశీల మధ్యాహ్నం భోజన వర్కర్స్ యూనియన్ (అనుబంధ టి యూ సి ఐ) సంగం ఆధ్వర్యంలో ఆన్ని పాఠశాలలో నవంబర్ 10వ తేదీన అన్ని పాఠశాలలో బందుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మధ్యాహ్న వంట బందు చేసి నిరసన చేయాలని పిలుపునివ్వడం జరిగింది
ఈరోజు గద్వాల జిల్లా డి ఇ ఓ బందుకు సంబంధించిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 9 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్న పట్టించుకోని ఉన్నత అధికారులు కొన్ని జిల్లాలో ఆగస్టు నెల వరకు బిల్లులు మంజూరైనప్పటికి గద్వాల జిల్లాలో ఇంతవరకు బిల్లులు విడుదల కాలేదు గుడ్డు బిల్లుకు సంబంధించి దాదాపుగా సంవత్సరం కావస్తున్న బిల్స్ చెల్లించడం లేదు కావున వెంటనే మధ్యాహ్నం భోజనం బిల్లులను విడుదల చేయాలి డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో టి యూ సి ఐ జిల్లా అధ్యక్షుడూ హనుమంతు మధ్యాహ్నం భోజనం వర్కర్స్ జిల్లా అధ్యక్షులు ఉప్పెర్ కృష్ణ, హరీష్ , రాజు ,శివ, ప్రేమ రాజు, పాల్గొన్నారు


