పాపన్నపేట, నవంబర్7. (జనంన్యూస్)
మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజు వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. వందేమాతర గీతం రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా పాపన్నపేట తాసిల్దార్ సతీష్, ఎస్సై శ్రీనివాస్ గౌడ్ లు విద్యార్థులకు వందేమాతర గీతం గొప్పతనాన్ని తమ ప్రసంగాలలో పేర్కొన్నారు, ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు మంగ నర్సింలు వందేమాతర గీతం పూర్తి సారాంశాన్ని విద్యార్థులకు వివరించారు, ఈ కార్యక్రమం పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం వెంకటేశం ఆధ్వర్యంలో కొనసాగింది, ఇందులో పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు,భట్టు నాగరాజు, రియాజ్, మోహన్ రావు, వేణుగోపాల్ రెడ్డి, రవికాంత్, సుభాష్ పద్మ, జాకీర , రజిత లక్ష్మి, తదితరులతో పాపన్నపేట పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,



