జనం న్యూస్ నవంబర్ 07 ( భద్రాద్రి కొత్తగూడెం )
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి మణుగూరు ఎంఈఓ స్వర్ణ జ్యోతి ఈరోజు సివి రామన్ 137వ జయంతిని పురస్కరించుకొని సింగరేణి ఉన్నత పాఠశాల పీవీ కాలనీ నందు చెకుముకి సైన్స్ సంబరాలను ప్రారంభించడం జరిగింది, విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానాన్ని ఆలోచన దృక్పథాన్ని రేకెత్తించే విధంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలను మణుగూరు సింగరేణి ఉన్నత పాఠశాల పివి కాలనీ నందు పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యా శాఖ అధికారి స్వర్ణ జ్యోతి విచ్చేసి సర్ సి.వి రామన్ గారి చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడు శాస్త్రీయ విజ్ఞానంతో ఆలోచించాలని, కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండాలని పాత ఆచారాలను మూఢనమ్మకాలను వదిలివేయాలని అలాగే మీ తోటి వారికి చుట్టుపక్కల వారికి అందరికీ మీ సాధ్యమైనంత వరకు శాస్త్రీయ అవగాహన కలిగించాలని తెలియజేశారు, అలాగే పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం వేణు మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానం పట్ల అవగాహన పెంచుకోవాలని, సర్ సివి రామన్ లాంటి శాస్త్రవేత్తల కృషి ఫలితంగా మన దేశం ఎంత అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగుతుందని కాబట్టి నేటి విద్యార్థులు కూడా అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తే ఈ దేశం ఇక ముందుకు వెళుతుందని ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండాలని తెలియజేశారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కల్చరల్ సెక్రటరీ లింగంపల్లి దయానంద్ గారు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులకు చెకుముకి సైన్స్ సంబరాల ద్వారా వారిలో ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని బయటకు తీసి వారిలో ఆలోచన దృక్పథాన్ని పెంపొందించడం లో మా జన విజ్ఞాన వేదిక ఎప్పుడూ ముందు ఉంటుందని వారు తెలియజేశారు, ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థుల చేత శాస్త్రియ ఆలోచన పెంపొందించే నాటికలు, నృ త్యాలతోటి ఆలరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే మమత, బి లలిత, ఎం రజిత, ఈ స్రవంతి, రాజియా, ఎం సింధు ప్రియా, తాహెర్ పాష , శత్రునాయక్ , హిమబిందు,తదితరులు పాల్గొన్నారు.



