జనం న్యూస్ నవంబర్ 07
ఆన్లైన్ మోసాల పట్ల మండలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. శుక్రవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..వాట్సప్‌ల ద్వారా వచ్చే లింక్‌లను ఓపన్ చేయరాదని,లాటరీ తగిలిం దని, బహుమతి వచ్చిందని అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని చెప్పారు. మండలంలోని వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద, మెయిన్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసే వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియజేయాలని అన్నారు.


