(జనం న్యూస్ 8 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండలం అవడం ఎక్స్ రోడ్ నుండి నర్సింగాపూర్ వరకు వెళ్లే రహదారిలో మూలమలుపులు వద్ద సూచికల బోర్డులు లేక పోవడంతో తరచూ ప్రమాదం జరుగుతున్నాయి రహదారులు వంకర్లు ఎక్కువగా ఉండడంతో వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించలేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు తెలిపారు ప్రతి రోజు చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగి మరణాలు సంభవించాయని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు


