Listen to this article

జనం న్యూస్ – నవంబర్ 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ –

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ నలగొండ సంస్థ నిర్వహించిన నల్లగొండ జిల్లా స్థాయి కరాటే టోర్నమెంట్ కం సెలక్షన్స్ లో నాగార్జునసాగర్ స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని ప్రిన్సిపాల్
ఏ శివకుమార్ తెలిపారు. ఈనెల 7వ తారీకున నల్లగొండ మేకల అభినవ్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి కరాటే టోర్నమెంట్ కం సెలక్షన్స్ లో అండర్ 17 -80 కిలోల విభాగంలో సయ్యద్ అబ్దుల్ ముసాఫిర్ బంగారు పతకం, అండర్ 17-68 కిలోల విభాగంలో ఎస్ వి ఎన్ ఎం కృష్ణ సాయి బంగారు పతకం, అండర్ 14- 35 కిలోల విభాగంలో బణావత్ వెంకటేష్ సిల్వర్ పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ లు మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు విశాలమైన తరగతి గదులలో ఉత్తమ విద్యతోపాటు ఆత్మ రక్షణకు కరాటే, విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంచడానికి డ్రాయింగ్ విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయులతో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఏ శివకుమార్, కరస్పాండెంట్ కె నకులరావు,
కరాటే మాస్టర్ వెంకట్, స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.