

సబ్ టైటిల్ , భీమారం మండల్ ప్రెస్ క్లబ్ సభ్యులు
జనం న్యూస్ జనవరి 31 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి =
మనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే ప్రతి వ్యక్తి శారీరక మానసిక దృఢత్వానికి కృషి చేయాలని సూచించారు. ఆటలు ఆడటం శారీరిక శ్రమ చేయడం ద్వారా మనిషి పూర్తిస్థాయి ఆరోగ్యం గా ఉంటాడని,ప్రతి వ్యక్తి ఎవరికి వారు వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి,ఏ వయసు వారైనా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ద్వారా జీవన కాలాన్ని పెంపొందించుకోవచ్చన్నారు.