Listen to this article

జనం న్యూస్ నవంబర్ 8 నడిగూడెం

మండలం లోని నారాయణ పురం నుండి వల్లాపురం గ్రామానికి వెళ్లే బిటి రోడ్డు కొన్ని సంవత్సరాల క్రితం నారాయణపురం గ్రామ శివారు వరకు అనేక గుంతలు ఏర్పడి గ్రామ ప్రజలు అనేక అవస్థలు పడుతున్న సమయంలో అధికారం లో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాన్ని అభివృద్ధి తో పాటు బిటి రోడ్డు ఏర్పాటు చేస్తుందని భావించిన గ్రామ ప్రజలకు ప్రభుత్వం 10సంవత్సరాలు అధికారం లో ఉండి కూడా కనీసం రోడ్డు నిర్మాణం కోసం కృషి చేయకపోవడం తో నారాయణపురం గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురుక్కోన్నారు.ఎన్నో సంవత్సరాలు గా ఇబ్బంది పడుతున్న నారాయణపురం (కేపీ గూడెం ) గ్రామ ప్రజల కళ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రావడం తో గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ వెంకటరెడ్డి కృషి తో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి 2 కోట్ల 30 లక్షలు మంజూరు చేయడం తో బిటి రోడ్డు తో పాటు, రోడ్డు కు రెండు వైపుల డ్రైనేజీ ఏర్పాటు చేయడం తో ఎన్నో ఏండ్ల కల నెరవేరిందని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.