జనం న్యూస్ నవంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అభినందించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
అమలాపురం :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామ విద్యార్థి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ (వయస్సు 7 సంవత్సరాలు 9 నెలలు) స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. ఈ చిన్నారి 195 దేశాల పేర్లు వాటి రాజధానుల పేర్లు కేవలం 2 నిమిషాల 59 సెకన్ల 11 మిల్లి సెకన్ల కాలవ్యవధిలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో అవార్డు సంపాదించాడు. శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను అమలాపురంలో కలిసారు. తను అందుకున్న అవార్డును చూసి మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ ను మనస్ఫూర్తిగా అభినందించి బావి జీవితంలో మరిన్ని అవార్డులు చేజిక్కించుకొని, జిల్లాకు రాష్ట్రానికి ఆపై దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని ఆ చిన్నారిని మంత్రి ఆశ్వీరదించారు. చిన్నారిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న తండ్రి ప్రసాద్, తల్లి దివ్యను కూడా మంత్రి అభినందించారు.


