Listen to this article

జనం న్యూస్ 10 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

*మూడు సంవత్సరాలుగా పూర్తికాని పంచాయతీ భవనం. తక్షణమే పంచాయతీ భవనాన్ని నిర్మించాలి. ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలి.గ్రామంలో ఉన్న ఆకతాయిల కారణంతో పాఠశాల సామాగ్రి ధ్వంసం. సమస్యల పరిష్కారానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి కృషి. యన్ యచ్చ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్. జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం మన్నపురం గ్రామంలో పంచాయతీ భవనాన్ని కూలగొట్టి కొత్తగా నిర్మిస్తామని చెప్పి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తి చేయకుండా అసంపూర్తిగా నిలుపుదల చేయడంతో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి పంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.శిథిలావస్థకు చేరిన పంచాయతీ భవనాన్ని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమితి నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మూడు సంవత్సరాలుగా పంచాయతీ భవన నిర్మాణం పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారని మరమ్మతుల కోసం పై కప్పును తొలగించారని వెంటనే భవన నిర్మాణం మరమ్మతులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమయ్యే పంచాయతీ భవనాన్ని నిర్మించకుండా నిధుల కొరతతో నిలుపుదల చేసి అసంపూర్తిగా వదిలేయడం పాలకులు మరియు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు.పంచాయతీ భవనం నిర్మాణం మరమ్మత్తులు కాకపోవడంతో అందులో కంపచెట్లు పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయని, దీంతో చేసేది ఏమీ లేక అద్దె భవనంలో పంచాయతీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. త్వరలోనే పంచాయతీ భవన నిలుపుదలపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం 309 మంది విద్యార్థులకు 6మంది టీచర్లు ఉండగా వీరిలో ఒకరు ప్రమోషన్ లో భాగంగా ఇతర పాఠశాలకు బదిలీపై వెళ్లడంతో మొత్తం 5మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని దీంతో విద్యార్థుల విద్యకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు సరిపోవడం లేదని ఆర్టీఈ చట్టం ప్రకారం మొత్తం 11 మంది ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా అట్టి స్థానంలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని, విద్యార్థులకు చదువుకు ఆటంకం లేకుండా ఉన్నతాధికారుల చర్యలు తీసుకొని 6 మంది ఉపాధ్యాయులను నియమించి విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలవపేతం చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడమే కాని ఇలాంటి హామీలు నెరవేర్చకుండా ఉపాధ్యాయులను నియమించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే విద్యార్థులకు వాష్ రూమ్ లకు తలుపులు లేవని, గ్రామంలో ఉన్న ఆకతాయిలు పాఠశాలకు సంబంధించిన సామాగ్రిని ధ్వంసం చేస్తున్నారని తెలుపగా పాఠశాల విద్యార్థుల సమస్యలపై త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు వెంకట్రాములు, ధరూరు మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు, మండల ఉపాధ్యక్షులు అడవి ఆంజనేయులు,మునెప్ప, , మండల నాయకులు సుదర్శన్, చిన్న రాముడు, ప్రేమ్ రాజ్, గొర్ల తిమ్మప్ప గ్రామ నాయకులు స్వామి, ఊరబాయి రాములు, దరెప్ప,కృష్ణ,ఆంజనేయులు, జయరాములు, రఘు, హనుమంతు,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.