Listen to this article

జనం న్యూస్ 10 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు జోగులాంబ దేవాలయం నుండి హైదరాబాద్ వరకు న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ప్రారంభమైన మహా పాదయాత్రకు అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు మద్దతు తెలిపారు.అలంపూర్ స్టార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్ర నవంబర్ 9న జోగులాంబ దేవాలయం వద్ద ప్రారంభమైంది. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తక్షణం అమలులోకి తేవాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఈ యాత్రను కొనసాగిస్తున్నారు.ఎమ్మెల్యే విజయుడు పాదయాత్రలో పాల్గొని న్యాయవాదులతో ఒక్కటైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయవాదుల భద్రత కోసం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, న్యాయవృత్తి గౌరవాన్ని కాపాడేందుకు రక్షణ చట్టం అవసరమని తెలిపారు.