జనం న్యూస్; నవంబర్ 10 సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్;
ప్రముఖ కవి, జయ జయహే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ మరణం సాహితీ రంగానికి తీరని లోటని సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, మిమిక్రీ రమేష్, వరుకోలు లక్ష్మయ్య, సింగీతం నరసింహారావు, బస్వరాజ్ కుమార్, కోణం పర్శరాములు, ఆదిమూలం చిరంజీవి, కాల్వ రాజయ్య, ఉండ్రాళ్ళ తిరుపతి తదితరులు తెపిపారు. అందెశ్రీ ఆకస్మిక మరణం కలిసి వేసిందని, అందెశ్రీ కి సిద్దిపేట కవులకు గల సంబంధాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర గేయంతో పాటు పల్లె అందాలు అందెశ్రీ రచనలలో కనువిందు చేస్తాయన్నారు.


