

జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్
50 మందికి పైగా రక్తదానం చేసిన దాతలు
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో ఫోరస్ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి చిన్నబాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన నాయకులలో గాంధీజీ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని అటువంటి గాంధీజీని ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది గాడ్సే 1948 జనవరి 30వ తారీఖున అందరూ చూస్తుండగానే కాల్చి చంపారని తెలిపారు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన ఆర్ఎస్ఎస్ నేడు దేశభక్తి, దేశద్రోహులు అంటూ ప్రజల మధ్య చీలిక తెస్తుందని అసలైన దేశద్రోహులు, సంఘవిద్రోహు శక్తులు ఆర్ఎస్ఎస్ వారని దుయ్యబట్టారు. ప్రజలందరినీ ఏకం చేసి స్వాతంత్రోద్యమం నడపడంలో గాంధీజీ పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఇదే సందర్భంలో ఆపదలో ఉన్న వ్యక్తులకు మనం అందించే సాయం రక్తదానమని అది ప్రాణదానంతో సమానమని తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది రక్తదాన శిబిరాలు జిల్లాలో అన్నిచోట్ల ఏర్పాటు చేస్తామని దానిలో భాగంగానే గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో రక్తదానం చేసిన విద్యార్థులందరికీ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి గారు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఎంతో ఉత్సాహంతో రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థి దశలోనే సాటివారికి సాయం చేయాలనే దృక్పథం విద్యార్థులకు కలగడం రేపటి మంచి భవిష్యత్తుకు పునాదులు అని తెలిపారు. ప్రతి ఏడాది విద్యార్థి సంఘమైన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో మొత్తంగా 50 మంది విద్యార్థులు రక్తదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జ్.రవి కుమార్ , కే. జగదీష్ ,జిల్లా సహాయ కార్యదర్శి శిరీష , సోమేశ్ ,పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, రాజు మరియు నాయకులు రాహుల్ కళ్యాణి తిరుమల ప్రసాద్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ కౌన్సిలర్ అప్పలనాయుడు గారు పాల్గొన్నారు.