Listen to this article

( జనం న్యూస్ 11 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామ పంచాయతీలోని ఊరు చెరువు మత్తల అభివృద్ధి పనుల కోసం 33 లక్షల నిధులను చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఏప్రిల్ నెల 21 తారీకు ప్రారంభించారు పనులు వేగవంతం చేయాలని చెరువు మరమ్మత్తులు పూర్తి చేపిస్తామని గ్రామ ప్రజలకు కేవలం భరోసా కల్పించారు, కానీ మత్తడి పనులు నత్త నడక, నడుస్తూ పైన బాగానే ఉన్నాయి కింద బొక్కలు పడి నీరు వృధా కావడంతో మా స్థితి మరలా గింతేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు , ఇరిగేషన్ అధికారులు సమస్యను స్పందించి తక్షణమే పనులు వేగవంతం చేయాలని ప్రజాధనాన్ని నిర్వీర్యం కాకుండా నాణ్యత లోపం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు