శ్రీ మహా మైసమ్మ ఆలయం వద్ద కుంకుమార్చన, అన్నదానం
జనం న్యూస్ :17 జూలై శుక్రవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ :ఆషాడ మహోత్సవ బోనాల పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ప్రశాంత్ నగర్ శ్రీ మహా మైసమ్మ దేవాలయంలో శుక్రవారం ఘనంగా పూజలు నిర్వహించారు.అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని భక్తితో పూజలు నిర్వహించారు.అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.మొక్కులు చెల్లించుకోవడానికి ఉదయం నుండే భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ కమిటీ సభ్యులు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.పూజా కార్యక్రమాలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.కార్యక్రమంలో భాగంగా శనివారం అమ్మవారి ఊరేగింపు ఆదివారం పట్నాలు,బోనాల జాతర ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు.