Listen to this article

జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

నిన్న అనగా ది.10.11.2025 న సాయంత్రం సుమారు 4.45 గంii ప్రాతంలో మట్టపర్తి మీరా సత్య మూర్తి @ చంటి అను ఆసామి స్కూల్ కు వచ్చి వరుసకు మేనకోడలు అయ్యే 10 సంవత్సరాల బాలికను ఇంటికి తీసుకు వెళ్తానని చెప్పి స్కూల్ నుండి కిడ్నాప్ చేసాడు.ఇది తెలిసిన పాప తల్లితండ్రులు అమలాపురం పట్టణ పోలీస్ వారికి రిపోర్ట్ ఇవ్వగా….డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ వారి పర్యవేక్షణలో అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ .వీరబాబు మరియు వారి సిబ్బందితో వెంటనే 5 టీమ్స్ గా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.అపహరణకు గురైన బాలికను పోలీసులు గంటల వ్యవధిలోనే సురక్షితంగా రక్షించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ కేసు ఛేదనలో పోలీసుల కృషిని ప్రజలు మరియు బాలిక కుటుంబ సభ్యులు కొనియాడారు. బాలిక ఆచూకీ కనుగొనడానికి నిన్న సాయంత్రం నుండి పోలీస్ బృందాలు విశ్రాంతి లేకుండా కృషి చేసినవి. వారి అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా, బాలికను సురక్షితంగా రక్షించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక కుటుంబ సభ్యులు మరియు పట్టణ ప్రజలు పోలీసు బృందం యొక్క అంకితభావాన్ని, వేగవంతమైన స్పందనను మనస్ఫూర్తిగా అభినందించారు.పోలీసుల చొరవతో తమ కుమార్తె క్షేమంగా తిరిగి వచ్చినందుకు బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.మహిళలపైన మరియు చిన్న పిల్లలపైన ఎవరైనా అఘత్యాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు కఠినముగా ఉంటాయి అని జిల్లా ఎస్పి ఈ సందర్బంగా హెచ్చరించారు.ఈ కేసు చేదనలో కృషి చేసిన డీఎస్పీ. టి ఎస్ ఆర్ కె ప్రసాద్, అమలాపురం, అమలాపురం పట్టణ సీఐ వీరబాబు మరియు వారి సిబ్బందిని ఎస్పి శ్రీ రాహుల్ మఅభినందించినా అభినందించినారు.