Listen to this article

జనంన్యూస్. 11.నిజామాబాదు. సిరికొండ.

నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో గల పియం శ్రీ తెలంగాణ ఆదర్శపాఠశాల& కళాశాలలో“డ్రగ్స్ వాడక నిషేధం & బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన సదస్సు” డ్రగ్స్ వాడక నిషేధం – యువత భవిష్యత్తు రక్షణ”అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మెడికల్ ఆఫీసర్స్ అరవింద్ &ప్రణవి. విచ్చేసి విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం మరియు వాటి వాడకం వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాల గురించి వివరించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి విద్యార్థులకు మంచివారి సహవాసం, క్రీడలు, పుస్తకాలు మరియు సృజనాత్మక కార్యకలాపాల ద్వారా మాదకద్రవ్యాల ఆకర్షణకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రతిజ్ఞ చేశారు.
ఆడపిల్లలకు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన మెడికల్ ఆఫీసర్ ప్రణవి మాట్లాడుతూ,“బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. క్రమం తప్పకుండా తన శరీరంలో మార్పులను గమనించడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మరియు వైద్య పరీక్షలు చాలా ముఖ్యం” అని తెలిపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి , బాలికలు ఆరోగ్యంపై చైతన్యంగా ఉండాలని, సిగ్గు పడకుండా వైద్య సలహా తీసుకోవడం అవసరమని సూచించారు.విద్యార్థినులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రశ్నలు అడిగి, ఆరోగ్య రక్షణపై అవగాహన పెంపొందించుకున్నారు. కార్యక్రమం ముగింపులో అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన పత్రికలు పంపిణీ చేయబడాయి
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ అరవింద్ మరియు ప్రణవి వారి బృందం ప్రధాన ఉపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి.ఉప ప్రధానోపాధ్యాయులు సౌమిత్రి మిగతా ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.