జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఎస్.కోట మండలం కొట్టాం పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని వేధించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. ఖాసాపీటకు చెందిన ఎర్రి నాయుడు అనే వ్యక్తి జాబ్ తీయించేస్తానంటూ బెదిరించడంతో సదరు ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. దీంతో మంగళవారం సాయంత్రం తిమిడి గ్రామం వద్ద నాయుడిని పట్టుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ వెల్లడించారు.


