Listen to this article

జనం న్యూస్ నవంబర్ నవంబర్ 11:

నిజామాబాద్ జిల్లా ఏర్గట్లపోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుపోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి. రాజేశ్వర్ తెలిపారు. గ్రామం కోజనకొత్తూర్ మండలము ఇబ్రహీంపట్నం కు చెందిన కె.నాని తండ్రి లక్ష్మణ్ వయస్సు 45సంవత్సరాలు వృత్తి హర్వెస్టర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడగాఆర్మూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్ మోటార్ వాహన చట్టం 2019 ప్రకారం రూ.10,000/- జరిమానా విధించారు.ఇన్‌స్పెక్టర్ పి. రాజేశ్వర్ మాట్లాడుతూ –“డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎవరికీ రాయితీలు ఉండవు. మద్యం సేవించి వాహనం నడిపేవారు తమ ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తారు. ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలి” అని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్:1)మద్యం సేవించి వాహనం నడిపితే మొదటి తప్పులోనే రూ.10,000 వరకు జరిమానా లేదా 6 నెలల జైలుశిక్ష విధించబడుతుంది. మళ్లీ పట్టుబడితే రూ.15,000 వరకు జరిమానా లేదా 2 సంవత్సరాల జైలుశిక్ష ఉంటుంది. లైసెన్స్ రద్దు చేయబడే అవకాశం కూడా ఉంది.రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.