జనం న్యూస్ 12 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణం షేరెల్లి వీధిలో జరిగిన బలిజ లక్ష్మీ హత్య కేసులో ప్రధాన నిందితుడు కల్లా రామిరెడ్డి డబ్బుపై ఆశతో బెట్టింగ్ గేమ్స్ కి అలవాటు పడి హత్య చేసేంతవరకు కూడ వెనకాడలేదంటే నమ్మశక్యం అవ్వట్లేదు అంటున్నారు రామిరెడ్డి కుటుంబం గురించి తెలిసిన సన్నిహితులు. దుడ్డు రుచి-.. డ్డు రుచి ఏ పని చేయడానికైనా సంసిద్ధంగా ఉంటుంది అనడానికి లక్ష్మీ హత్య కేసు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బి.టెక్ చదివిన రామిరెడ్డి బెట్టింగ్ లకు(ఈజీ మని) అలవాటు పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడని సమాచారం. ఇట్టి బెట్టింగ్ వ్యవహారంలో రామిరెడ్డిపై గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు కూడ గతంలో నమోదైంది. మళ్ళీ అదే బెట్టింగ్ వ్యసనానికి బానిసై హత్య వరకు వెళ్ళాడంటే చింత చచ్చినా-పులుపు చావలేదు అన్నట్టుగా వ్యవహారించాడు ఈ హత్య చేసి. ఆదివారం లక్ష్మీని హత్య చేసి అదే రోజు తన కుటుంబాన్ని కారులో తీసుకుని హైదరాబాద్ వరకు వెళ్ళాడంటే ఎంత గట్టి గుండెనో రామిరెడ్డిది అంటున్నారు తెలిసిన వాళ్లంతా. ఎందుకంటే ఏదేని ఒక చిన్న తప్పు చేస్తేనే ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి సామాన్యంగా తప్పు చేసినవారికి. అలాంటిది హత్య చేసి,బంగారు దొంగలించి దర్జాగా భార్య పిల్లలతో గద్వాల నుండి హైదరాబాద్ వరకు సుమారు 200 కిలోమీటర్లు స్వతహాగ కారు నడుపుకుంటూ వెళ్లడమంటే చాలా గ్రేట్ అంటున్నారు మేధావులు. ఆదివారం రాత్రి బంగారు కరిగించుకుని సోమవారం హైదరాబాద్ లో అమ్మేసి వచ్చిన డబ్బుల్తో అదే రోజు మళ్ళీ ఫిలిప్పిన్స్ దేశంలో లైసెన్స్ కలిగిన బెట్టింగ్ యాప్ గేమ్ లో లక్ష రూపాయలు బెట్టింగ్ పెట్టాడని సమాచారం.మంగళవారం గద్వాలకు వచ్చి గద్వాలలోని సందీప్ జ్యువెలర్స్ లో భార్య కమ్మలు కుదపెట్టిన బంగారు విడిపించుకుని,తిలా పాపం-తలా పిడికెడు అన్నట్టు తల్లికి ఒక లక్ష రూపాయలు పెట్టుకోమని ఇచ్చి పాపం చేసి పుణ్యం కలగాలనో లేక భక్తిలో ఉంటే అనుమానం రాకుండగా పోలీసులు పట్టుకోలేరు అనుకున్నాడో తెల్వదు కానీ బుధవారం స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప మాల వేసుకున్నాడట రామిరెడ్డి.కేసులో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసుల దృష్టి మొత్తం ఆ కాలనీకి వచ్చి పోయే వాళ్లపైన, మృతురాలు లక్ష్మీ వాడిన సెల్ ఆధారంగా మాత్రమే కేసు విచారణ కొనసాగింది. మృతురాలు లక్ష్మీ సెల్ లో మాట్లాడిన వారందరిని ఒక బృందం, షేరెల్లి వీధి వైపు గల సిసి కెమెరాలు అన్ని ఒక బృందం, అటుగా వెళ్లి వస్తున్న వాహనాలను ఒక బృందం పరిశీలిస్తున్న క్రమంలో రామిరెడ్డి ఉదయం 11 గంటల సమయంలో ఆ గల్లీలో వెళ్లడం, ఒక గంట తర్వాత రావడం. మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెళ్లడం తిరిగి పది నిమిషాల వ్యవధిలో రావడం గుర్తించారు పోలీసులు.తీగ లాగితే డొంక కదిలినట్టు రామిరెడ్డి అటువైపు ఎప్పుడొచ్చాడు?, ఎప్పుడెల్లాడు?, ఎందుకోసం వచ్చాడు?, ఎవరి దగ్గరకు వెళ్ళాడు?… అనే అనేకమైన అనుమానాలను పోలీసులు స్వామి మాలలో వున్న రామిరెడ్డిని పిలిచి అడగగా రామిరెడ్డి నుండి పొంతన లేని సమాధానం వచ్చాయని తెలిసింది. మాల తీసేసాక పోలీసులు తమదైన రీతిలో గానా భజానా చేస్తే అప్పుడు అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడట రామిరెడ్డి.కథ కంచికి-మనం ఇంటికి అన్న మాదిరి లక్ష్మీ కథ పోలీస్ స్టేషన్ కి-కల్లా రామిరెడ్డి కథ కటకటాలకి ముగిసింది.


