జనంన్యూస్. 12.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ రోజు ఇందూరు కళాభారతి నిర్మాణ స్థలాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.ఎమ్మెల్యే కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు మరియు సంబంధిత విభాగాల ప్రతినిధులతో చర్చించి, ప్రాజెక్టు ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలు, బకాయిలు మరియు పెండింగ్లో ఉన్న నిర్మాణ భాగాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ-:బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు నాలుగు సంవత్సరాల క్రితం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గనికి కళాభారతి మంజూరు చేస్తున్నాం అన్నప్పుడు ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు కారణం ఇందూర్ నగరం అన్న, ఇందూరు జిల్లా అన్న కళాకారుల గడ్డ.. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా చూస్తే వేలాదిమంది కళాకారులు ఉన్నారు. ఈ జిల్లాలలో జాతీయ అంతర్జాతీయకి స్థాయి ఎదిగిన కళాకారులు ఇందూర్ జిల్లాలో ఉన్నారు. వాళ్లందరికీ కూడా ఒక వేదిక వస్తుందని చాలా సంతోషపడ్డారు ప్రస్తుతం ఈ అద్భుతమైన వర్క్ నడుస్తుంది కళాభవనానికి బడ్జెట్ 116 కోట్లు ..మొదట 50 కోట్ల మంజూరు చేశారు. ఇప్పటివరకు 50 కోట్ల వరకు పూర్తి అయింది.. కాంట్రాక్టర్ గారు చెప్పేదేంటంటే సుమారు 27 కోట్ల బకాయిలు చాలా మట్టుకు ఒక సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు .. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతా ఉన్నాను ఇన్ని సంవత్సరాల కాలంలో దశాబ్దాల నుండి ఎదురుచూస్తున్న కళాకారుల కళా ఏదైతే ఈ కళాభారతి భవనo ఉందొ దాన్ని పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు చేయాలని ఏదైతే ఈ ప్రాజెక్టుకి ఇంకా కావాల్సిన నిధులు కూడా 66 కోట్ల నిధులు మంజూరు చేసి పని ఆటంకం కాకుండా చూడాలని ఎందుకంటే ఇది ఒక్కరి కోసం కాదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కూడా చాలా ఉపయోగపడుతుంది. స్టేట్ లెవెల్ పోటీలు ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహించుకోవచ్చు. ఇది పూర్తి అయితే తెలంగాణలోని అత్యాధునిక హంగులతో కళాభారతి భవనాన్ని కళాకారులకు కోసం నిర్మించబడుతుంది.. ఈ ప్రాజెక్టు ఎక్కడ ఆటంకం కలగకుండా ఏ నిధులతోనైనా మంజూరు చేసి ఈ కళాభవనాన్ని పూర్తి చేయాలని నా ఇందూరు ప్రజల తరపున నా జిల్లా ప్రజల తరపున వేలాది మంది కళాకారుల తరఫునుండి కోరుతున్నాను దయచేసి కాంట్రాక్టర్కు పెండింగ్ ఉన్న బిల్లులను మంజూరు చేయాలి ఎందుకంటే మీరు మంజూరు చేస్తేనే మిగతా వర్క్ స్టార్ట్ అవుతుంది మళ్లీ బడ్జెట్లో 66 కోట్లు మంజూరు చేస్తే తెలంగాణలోని అత్యాధునిక కాలభారతి భవనం పూర్తి అవుతుంది ఏదైతే అప్పటి ప్రభుత్వము ఈ కళాభారతి భవననికి ” ఇందూర్ కళభారతి ” అనే పేరు పెడతామని చెప్పారో దానికి పూర్తి మద్దతు ఇస్తా ఉన్నాం తప్పకుండా ఇది పూర్తి అయిన తర్వాత ఇందూర్ కళాభారతి అని పేరు పెట్టాలని సూచించారు..ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే తో పాటు అధికారులు R&B dept DE ప్రవీణ్ కుమార్, AE సాయికుమార్ మరియు స్థానిక నాయకులు మాజీ కార్పొరేటర్ ప్రభాకర్ , మఠo. పవన్ , మారేవర్ కృష్ణ , బట్టికిరి ఆనంద్ , తదితరులు పాల్గొన్నారు



