Listen to this article

జనంన్యూస్. 12.నిజామాబాదు. ప్రతినిధి.

నిజామాబాదు. మద్యం మత్తులో వాహనము నడిపిన వారిపై మోటర్ వెహికల్ సవరణ చట్టం 2019 ప్రకారము శిక్షలు ఈ దిగువ విధంగా గలవు: పోలీస్ కమీషనర్ వెల్లడి మోటర్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 185 క్రింద డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారు శిక్షర్హులు మొదటి సారి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టు బడినట్లయితే 2,000/- రూపాయలు లేదా 6 నెలల వరకు జైలు లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష మొదటి సారి పట్టు బడిన తరువాత 3 సంవత్సరాల వ్యవధిలో మళ్ళీ పట్టు బడినట్లయితే 3,000/- జరిమానా లేదా 6 నెలల జైలు లేదా జరిమానాతో పాటు జైలు ఇక నుండి మోటర్ వెహికల్ ఆమెండ్మెంట్ యాక్ట్ 2019 అమలు.మోటర్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం డ్రంకెన్ డ్రైవ్లో పట్టు బడిన వారికి కోర్ట్ లో *మొదటి సారి పట్టుబడిన వారికి 10,000/- రూపాయలు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష రెండు విందించబడును. డ్రంకెన్ డ్రైవ్లో రెండో సారి పట్టు బడిన వారికి 15,000/- రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడును.ఇతర చర్యలు.డ్రైవింగ్ లైసెన్స్ రద్దు లేదా సస్పెండ్ చేయవచ్చు.తాగి రోడ్ ప్రమాదం చేసి ఎదుటి వారు మరణిస్తే IPC సెక్షన్ 105 BNS ( 304 II) కింద కేసు నమోదు చేయబడును ఇట్టి సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాలు వరకు జైలు లేదా జరిమానా లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష. తాగి నడిపి ప్రమాదం చేసి ఎదుటివారు గాయలకు గురైతే సెకండ్ 110 BNS (308 ఐపీసీ) కింద కేసు నమోదు చేయబడును ఇట్టి సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు లేదా జరిమానా లేదా జైలు శిక్ష తో పాటు జరిమానా కూడా విందించబడును పోలీస్ Breath Analyzer ద్వారా పరీక్షించవచ్చు మరియు పరీక్ష నిరాకరించినా కూడా అదే సెక్షన్ కింద శిక్షించవచ్చు.కావున ప్రతి వాహనాదారుడు రోడ్డు భద్రత నియమాలు తూచా తప్పకుండా పాటించాలని నిజాంబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. హెచ్చరించడడం జరిగింది.