Listen to this article

లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు- ఎస్సై ముత్తయ్య

జనం న్యూస్ – నవంబర్ 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ పరిధిలో మైనర్, రాష్ డ్రైవింగ్ లపై పోలీసులు దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా మైనర్ రాష్ డ్రైవింగ్ లపై వార్తాపత్రికలలో వస్తున్న కథనాలకు స్పందించిన నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై ముత్తయ్య బుధవారం తన సిబ్బందితో కలిసి గవర్నమెంట్ జూనియర్ కళాశాల, బస్టాండ్ తదితర ప్రాంతాల వద్ద తన సిబ్బందితో కలిసి లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించారు, మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రుల పై, వాహనాలు ఇచ్చిన వాహన యజమానులపై కేసులు బుక్ చేస్తామని తెలిపారు. రాష్ డ్రైవింగ్ తో పాదచారులకు, ఇతర వాహనదారులకు ఇబ్బంది కల్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని త్రిబుల్ రైడింగ్ చట్టరీత్యా నేరమని, ఎవరైనా మైనర్, రాష్, త్రిబుల్ రైడింగ్ చేస్తూ వాహనాలు నడిపితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. పాఠశాలలు, కాలేజీలు వదిలే సమయంలో నిత్యం తమ సిబ్బంది నిఘ ఉంటుందన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా తమ చదువుపై దృష్టి సారించాలని మాదకద్రవ్యాలకు, బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు సైతం తమ పిల్లల నడవడికపై అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.