జనం న్యూస్ నవంబర్ 13 మునగాల
సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు రాంపంగు వెంకటరత్నం మృతి సీపీఎం పార్టీకే తీరంలోని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. గురువారం నేలమర్రి గ్రామంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ రాంపంగు వెంకటరత్నం మృతి చెందగా, ఆయన మృతదేహం పైన సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు ఎర్రజెండాను కప్పి వారికి విప్లవ జోహార్లు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకటరత్నం అక్షరాలు రాకున్నా తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం,ఎర్రజెండా నాయకత్వాన అనేక ప్రజా పోరాటాలలో పేద పక్షాన ప్రజలకు అండా నిలిచి కష్టజీవుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండా పార్టీ మార్గమని కడవరకు కమ్యూనిస్టు గానే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వా వారసులు అనేక పోరాటాల్లో ముందుండి నడిచిన వ్యక్తి వెంకటరత్నం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు బట్టుపల్లి ఉపేందర్, మండవ వెంకటాద్రి, ఎం గోపయ్య, ప్రజానాట్య మండల జిల్లా అధ్యక్షులు బి రాంబాబు, వ్యకాస జిల్లా నాయకులు బి రామ్ చరణ్,సీపీఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శులు బట్టుపల్లి సుందరయ్య, బి సుధాకర్,కె కోటయ్య, బి మాధవి, మదార్ సికిందర్, మల్సూర్, బి నరేష్, రాములు, వెంకటేశ్వర్లు, ఎస్.కె నబి, తదితరులు పాల్గొన్నారు.


